నిరసనల మధ్యనే రైతుల పాదయాత్ర

అమరావతి రైతుల పాదయాత్ర నిరసనల మధ్యనే కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర జరుగుతుంది

Update: 2022-10-20 06:50 GMT

అమరావతి రైతుల పాదయాత్ర నిరసనల మధ్యనే కొనసాగుతుంది. ఒకవైపు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు పాదయాత్ర చేస్తుంటే, మరో వైపు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. అమరావతి రైతుల మహాపాదయాత్ర నేటికి 39వ రోజుకు చేరుకుంది. మండపేట నియోజకవర్గంలోని కేశవరం నుంచి పాదయాత్రను రైతులు ఉదయం ప్రారంభించారు.

అనపర్తి మీదుగా...

అనపర్తి మీదుగా రామవరం వరకూ ఈరోజు రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 14 కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే అడగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నల్ల బెలూన్లు, నినాదాలతో రైతులకు నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం భోజన విరామానికి అనపర్తి సావరం చేరుకుంటుంది. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి రామవరంలోని కర్రి జట్లారెడ్డి కల్యాణమండపంలో రైతులు బస చేయనున్నారు.


Tags:    

Similar News