ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు కేసు.. ఈరోజు ఇలా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో మాజీ మంత్రి నారాయణకు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ జారీ చేసిన నోటీసులపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. సీఐడీ విచారణపై తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ కోరారు. అయితే దీనిపై బుధవారం విచారిస్తామని కోర్టు తెలిపింది. ఐఆర్ఆర్ కేసులోనే సీఐడీ నోటీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్‌కు హైకోర్టులో పూర్తిగా ఊరట లభించలేదు. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఐడీ పునీత్‌కు నోటీసులు జారీ చేసింది. తనకు సీఐడీ ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే పునీత్‌ను ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం గం.1 వరకు, న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన నారా లోకేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఈరోజు ఉదయం చేరుకున్నారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విచారణ కొనసాగనుంది. మధ్యలో గంట సేపు భోజనం కోసం విరామం ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌పై సీఐడీ అధికారులు పలు ప్రశ్నలకు సిద్ధం చేసుకున్నారు.