Andhra Pradesh : గుడ్ న్యూస్.. నేడు తేలికపాటి వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో నేడు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది;

Update: 2024-05-06 01:46 GMT

Ap weather updates

ఆంధ్రప్రదేశ్ లో నేడు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండల నుంచి కొంత ఉపశమనం ఏపీ ప్రజలకు లభించనుంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వర్సాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

ఈదురుగాలులు కూడా...
వర్షాలతో పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు పొలాలు, చెట్ల వద్ద ఉండవద్దని, పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది.


Tags:    

Similar News