పెగాసస్ స్పై వేర్ ను టీడీపీ కొనే ఉంటుంది
పెగాసస్ స్పై వేర్ కు సంబంధించి చంద్రబాబు ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని అంబటి రాంబాబు అన్నారు.
పెగాసస్ స్పై వేర్ కు సంబంధించి చంద్రబాబు ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని అంబటి రాంబాబు అన్నారు. మమత బెనర్జీ అసెంబ్లీలో ప్రకటించారంటే ఏదో ఉండి ఉంటుందని ఆయన అన్నారు. మమత బెనర్జీతో తమ పార్టీకి ఎలాంటి స్నేహపూర్వకమైన సంబంధాలు లేవని చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమత కలసి పనిచేసిన విషయం వాస్తవం కాదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను....
టెక్నాలజీకి ఆద్యుడనని తాను చెప్పుకునే చంద్రబాబు అధికారికంగా కాకుండా వ్యక్తిగతంగా కొనుగోలు చేసి ఉండవచ్చని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. సాక్షి దినపత్రికపై పరువు నష్టం దావా వేసిన లోకేష్ మమతపై కూడా వేస్తారా? అని ప్రశ్నించారు. పెగాసస్ స్పై వేర్ కొనుగోలుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీపై నిఘా పెట్టిందని, అప్పటి ఇంటలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయాన్ని అంబటి గుర్తు చేవారు. పెగాసస్ స్పై వేర్ ను టీడీపీ ప్రయోగించే ఉంటుందని ఆయన అన్నారు.