Ambati Rayudu : ఓహో... అందుకా రాయుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పింది

అంబటి రాయుడు తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు;

Update: 2024-01-07 11:44 GMT
Ambati Rayudu, YCP, Political entry, APnews, Guntur

వైసీపీలోకి రాయుడు.. ఫుల్‌ క్లారిటీ ఇదే.!

  • whatsapp icon

అంబటి రాయుడు తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దుబాయ్ వేదికగా జరగనున్న ఐఎల్ టీ 20లో ఆయన ఆడబోతున్నట్లు ప్రకటించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ 20లో అంబటి రాయుడుకు చోటు దక్కింది. అంబటి రాయుడు ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు.

రాజకీయాల నుంచి...
ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు పది రోజులు తిరగక ముందే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణాలమేటన్న దానిపై అనేక చర్చోప చర్చలు జరిగాయి. రాజకీయ పార్టీలు అనేక రకాలుగా విమర్శలు చేశాయి. అయితే ఆయన ట్వీట్ తో అసలు విషయం స్పష్టమయింది. తిరిగి క్రికెట్ ఆడేందుకే రాయుడు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఈ తాజా ట్వీట్ తో స్పష‌్టమయింది.


Tags:    

Similar News