ఏబీ చంద్రబాబు తొత్తు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
ఐపీఎస్ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఎవరి అనుమతితో మీడియా సమావేశం పెట్టారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఐపీఎస్ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఎవరి అనుమతితో మీడియా సమావేశం పెట్టారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. సస్పెన్ష్ లో ఉన్న అధికారి పెగాసస్ స్పై వేర్ కొనలేదని ఎలా సమర్ధిస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను ఏబీ వెంకటేశ్వరరావు సమర్ధించడం దుర్మార్గమని చెప్పారు. పెగాసస్ కొనుగోలు చేయలేదని ఈయన ఎలా చెబుతారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
టీడీపీ కార్యాలయంలో.....
ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించే బదులు టీడీపీ కార్యాలయంలో పెడితే బాగుండేదని అంబటి రాంబాబు అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు మాటలను ఎవరూ విశ్వసించరని చెప్పారు. పెగాసస్ కొనుగోలుపై చంద్రబాబు మాట్లాడకుండా ఏబీ చేత మాట్లాడించారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తనపైన ఆయన పరువు నష్టం దావా వేశారని, రాజకీయాల్లో ఉన్న తాము ఇలాంటి వాటికి భయపడతామా? అని ప్రశ్నించారు.