ఏపీ టెన్త్ రిజల్ట్ డేట్ ఫిక్స్?

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాల మే రెండోవారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Update: 2023-04-23 07:07 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాల మే రెండోవారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మూల్యాంకనం కూడా పూర్తి కావచ్చింది. పదో తరగతి పరీక్షలు సమర్థవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం మే రెండో వారంలోనే విడుదల చేయడానికి సిద్ధమయింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై 18వ తేదీతో ముగిశాయి. ఈ నెల 19వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నెల 26వ తేదీ వరకూ ఆన్సర్ షీట్లను దిద్దడం పూర్తవుతుంది.

మే రెండో వారంలో...
ప్రతి ఏటా జూన్‌లో విడుదల చేస్తూ వస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం మే నెలలోనే విడుదల చేయనుంది. రీ వెరిఫికేషన్‌కు విద్యార్థులు అడిగినా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఇప్పటికే ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మే రెండో వారంలో ఏపీ విద్యార్థుల పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని అంతా సిద్ధం చేస్తుంది. మరి ఏదైనా ఆటంకాలు జరిగితే తప్ప రెండో వారంలోనే రిజల్ట్ రిలీజ్ అవుతాయని విద్యాశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.


Tags:    

Similar News