Andhra Pradesh : నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి;

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంపై చర్చ జరగనుంది. శాసనసభ, శాసనమండలిలో ఈరోజు గవర్నర్ ప్రసంగం పై చర్చించనున్నారు. నిన్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు చర్చ జరగనుంది.
చంద్రబాబు ప్రసంగం
చర్చ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరగా గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. ఇప్పటికే తాము సభకు హాజరు కాకూడదని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అయితే శాసనమండలిలో మాత్రం వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు హాజరై గవర్నర్ ప్రసంగంపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజులు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.