అసెంబ్లీకి వెళుతున్నాం : ఆనం, కోటంరెడ్డి

ఈ నెల 21వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2023-09-17 13:10 GMT

ఈ నెల 21వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కానున్నారు. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ అయి అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. రెండు రోజుల్లో న్యాయస్థానాల్లో నిర్ణయాలను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రజా సమస్యలపై...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను పార్టీ సస్పెండ్ చేయడంతో వారు టీడీపీలో చేరిపోయారు. అయితే ఆనం, కోటంరెడ్డి మాత్రం ఈరోజు సమావేశమై అసెంబ్లీ సెషన్స్ కు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై చర్చించారు. సమావేశాలకు వెళతామని చెప్పిన ఎమ్మెల్యేలు, తమను ఎందుకు సస్పెండ్ చేసిందో ఇంతవరకూ వైసీపీ చెప్పలేదన్నారు. ఎమ్మెల్యేలుగా తమకు సభకు వెళ్లే హక్కు ఉందన్నారు. సభలో అనేక అంశాలపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వారు చెప్పారు.


Tags:    

Similar News