నేడు సోము వీర్రాజు దీక్ష
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేడు ఉద్యోగులకకు మద్దతుగా దీక్షకు దిగనుంది.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేడు ఉద్యోగులకకు మద్దతుగా దీక్షకు దిగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు విజయవాడ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగుతున్నారు. ఉద్యోగులు తమకు పీఆర్సీలో అన్యాయం జరిగిందని నేటి నుంచి ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్షను చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.
ఉద్యోగ సంఘాలకు మద్దతుగా....
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వీరికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. బీజేపీ వెంటనే పీఆర్సీ జీవోను రద్దు చేసి ఉద్యోగులు డిమాండ్ చేసిన విధంగా పీఆర్సీని ప్రభుత్వం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. సోము వీర్రాజుతో పాటు మరికొందరు నేతలు కూడా దీక్షలో పాల్గొననున్నారుర.