వచ్చెనెల 8న విశాఖకు ప్రధాన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిజానికి గత నెలలోనే ప్రధాని విశాఖకు రావాల్సి ఉంది. అయితే తుపాను కారణంగా ఆయన పర్యటన రద్దయింది. దీంతో జనవరి ఎనిమిదోతేదీన ప్రధాని విశాఖ పట్నం పర్యటనకు వస్తున్నారు.గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ తో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను...
విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారని తెలిసింది. దీంతో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఎనిమిదో తేదీన ప్రధాని వస్తుండటంతో విశాఖలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడానికి కూటమి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.