మొదలైన కేబినెట్ భేటీ : కీలక అంశాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. ఈ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 49 అంశాలను చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. ఈ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 49 అంశాలను చర్చించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో విద్యార్థులకు ఇంటర్నేషనల్ బాక్యులరేట్ విద్యావిదానంపై లెటర్ ఆఫ్ ఇంటెంట్ కు ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఏపీ జీపీఎస్ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఒంగోలులో నర్సింగ్ కళాశాల ఏర్పాటు, మావోయిస్టు లపై నిషేధం కొనసాగించే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించనుుంది.
49 అంశాలు...
కేబినెట్ అజెండాలో మొత్తం 49 అంశాలున్నాయి. యూపీఎస్సీ పరీక్షలో రాత పరీక్షకు హాజరై క్వాలిఫై అయి ఉన్న అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించే పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు కూడా ఆమోదం తెలపనుంది. పోలవరం నిర్వాసితుల బాధితులకు అవసరమైన ఇంటి నిర్మాణాల కోసం నిధులు విడుదల చేసే అవకాశముంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శాశ్వత ఉద్యోగుల నియామకంపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.