పింఛన్లు పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక సమావేశం తీసుకుంది. పింఛన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక సమావేశం తీసుకుంది. పింఛన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. సామాజిక పింఛన్లను 2,500 రూపాయల నుంచి 2,750 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి కొత్త పింఛన్ల మొత్తాన్ని లబ్దిదారులకు అందచేయనున్నారు. మొత్తం 62.31 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు...
నాడు - నేడు కార్యక్రమంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. అన్ని పాఠశాలలకు స్మార్ట్ టీవీలు ఇచ్చే నిర్ణయం తీసుకుంది. వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు తరలించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ పశుబీమా పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జిల్లా నేతలను సమన్వయం చేసుకుని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు.