Andhra Pradesh : ఏపీ కేబినెట్ లో మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లుందిగా

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ప్రారంభమైంది;

Update: 2025-01-02 08:18 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ప్రారంభమైంది. కొత్త ఏడాది జరుగుతున్న తొలి సమావేశం కావడంతో కొన్నికీలక అంశాలకు కేబినెట్ ఆమోదించినట్లు తెలిసింది. అమరావతిలో 2,373 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్ కు కూడా అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాల అనుమతులు జారే చేసే అధికారం మున్సిపాలిటీలకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలెప్ మెంట్ అధారిటీలో 19 అదనపు పోస్టులకు అనుమతి మంజూరు చేసింది. మొత్తం పథ్నాలుగు అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

బాధ్యత లేకుండా...

అదే సయమంలో కేబినెట్ లో అధికారిక చర్చముగిసిన తర్వాత ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమయ్యారు. అయితే ఈ సందర్భంగా మంత్రులకు క్లాస్ పీకినట్లు తెలిసింది. ఆరు నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా పనితీరు మెరుగుపర్చుకోక పోవడంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లయినా పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడతారని భావించి కేబినెట్ లో చోటు కల్పిస్తే కనీస బాధ్యతలేకుండా వ్యవహరించడమేంటని ప్రశ్నించినట్లు తెలిసింది. కొందరి పేర్లు పెట్టి మరీ ఇలాగయితే తాను తీవ్రమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని, ఎప్పటికప్పడు తప్పులు కౌంట్ అవుతున్నాయని కూడా చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News