Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. పవన్ డుమ్మా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించనున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళుతుండటంతో ఈ కేబినెట్ భేటీకి ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 1982 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రిపీల్ బిల్లు ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది.
వివిధ అంశాలపై...
అనేక భూములు గత ఐదేళ్లుగా అన్యాక్రాంతం కావడంతో ఈ బిల్లుపై కూలంకషకంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు చట్టాన్ని రద్దు చేసే దిశగా కేబినెట్ నిర్ణయం ఉండే అవకాముంది. కొత్త బిల్లును తీసుకు రానుంది. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. డ్రోన్, నూతన క్రీడా విధానం, డాటా సెంటర్ పాలసీలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు.