నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో కొన్ని ముఖ్య అంశాలపై చర్చించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ కు సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహయింపుపై కేబినెట్ లో చర్చించే అవకాశముంది.
కీలక అంశాలపై...
దీంతో పాటు రాష్ట్రంలోని దేవాలయాల పాలకమండళ్ల నియామకాలపై చట్ట సవరణపై కేబినెట్ చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించిన చెత్త పన్ను రద్దుపై కూడా కేబినెట్ చర్చించనుంది. పారిశ్రామిక వేత్తలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనుంది. సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై కూడా చర్చించనున్నారు.