Andhra Pradesh : రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం.. ముఖ్య నిర్ణయాలివే

రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయలు తీసుకోనున్నారు.

Update: 2024-06-23 06:32 GMT

రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయలు తీసుకోనున్నారు. ఇందుకోసం అజెండాను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఎనిమిది శాఖలకు..
మొత్తం మీద ఎనిమిది శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూలంకషంగా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. ఆదాయ వనరులను పెంచుకునే మార్గాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని చెబుతున్నారు. గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు.


Tags:    

Similar News