రాజధాని పిటీషన్ల పై నేడు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల పిటీషన్లపై నేడు హైకోర్టులో కీలక తీర్పు ఇవ్వనుంది.

Update: 2022-03-03 02:11 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల పిటీషన్లపై నేడు హైకోర్టులో కీలక తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీర్పు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ దాదాపు 70 పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ప్రభుత్వంతో తమకు ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘనపై ప్రశ్నిస్తూ రైతులతో పాటు మరికొందరు పిటీషన్లు దాఖలు చేశారు.

వెనక్కు తీసుకున్నా....
అయితే ఈ పిటీషన్లు విచారణ దశలో ఉండగానే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గత ప్రభుత్వం పేర్కొన్నట్లు తమకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని కోరుతున్నారు. దీనిపై ఇరువురు వాదనలను విన్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గత నెల 4వ తేదీన తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెలువరించనుంది.


Tags:    

Similar News