Tirupathi Incident : పవన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చి బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు;
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని చెప్పిన ఆయన ఎవరో చెబితే తాము ఎందుకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. క్షమాపణలతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని నిలదీశారు.
క్షమాపణ చెప్పాలంటూ...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిన్న తిరుపతిలోనూ, నేడు పిఠాపురంలోనూ తిరుపతి ఘటనపై టీటీడీ ఈవో, ఛైర్మన్ లు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెబుతుందని, ఘటనకు టీటీడీ ఈవో, జేఈవో, ఛైర్మన్ లు కారణమంటూ ధ్వజమెత్తడంతో ఆయన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కొట్టిపాశారు.