Chandrababu : ఏపీ కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ ఎమ్మెల్యే కామెంట్స్ పై నవ్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు. అయితే ఈసందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ, కామెంట్స్ ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉణ్న సమయంలో ఏ ఇజం లేదని, టూరిజమే ముఖ్యమని అనేవారని, కానీ నాడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలుకు కోపం వచ్చేదని, కానీ అదే నేడు నిజమయిందని అన్నారు. ఖర్చు లేకుండా ఆదాయం వచ్చేది ఏదైనా ఉందంటే అది టూరిజమేనని ఇప్పుడు తెలిసి వచ్చిందన్నారు.
టూరిజంపై కూనంనేని వ్యాఖ్యలను...
దీనిపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రస్తావిస్తూ నాడు టూరిజాన్ని తాను డెవలెప్ చేస్తే కమ్యునిస్టులతో పాటు అందరూ నవ్వుకునేవారని, నాడు నేను అన్న మాటలు నిజమయ్యాయని వారు అంగీకరించడం ఒక రకంగా ఆనందం కలుగుతుందని అన్నారు. నాడు తన వ్యాఖ్యలపై విరుచుకుపడిన కమ్యునిస్టులు అర్థం చేసుకోవడానికి మూడు దశాబ్దాల సమయం పట్టిందని చమత్కరించారు చంద్రబాబు. అయితే ఇప్పుడు మనకు అంత సమయం లేదని, త్వరగా అనుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసి ముందుకెళ్లాలని చంద్రబాబు కలెక్టర్లతో అన్నారు.