Chandrababu : ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించిన అంశాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీజిగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీజిగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అమరావతి నిర్మాణానికి కూడా సహకరించాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించిన పనులు కూడా వేగిరం పూర్తి చేయాలని కోరారు.
ఏపీ పర్యటనకు రావాలంటూ...
ఏపీ పర్యటనకు రావాలని చంద్రబాబు మోదీని ఆహ్వానించారు. ఈ నెల 8వ తేదీన మోదీ పర్యటన ఏపీలో ఖరారు అయిన నేపథ్యంలో ఆయన చేత 85 వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ప్రధానితో చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు వేగంగా ఆమోదం తెలపాలని కూడా కోరారు. తర్వాత ప్రధాని మోదీ అమిత్ షా, నిర్మలా సీతారామన్ లతో భేటీ కానున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ