Chandrababu : రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆదుకోండి.. ప్రత్యేక పరిస్థితులుగా గమనించండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

Update: 2024-08-17 12:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సహకరించాలని చంద్రబాబు మోదీని కోరారు అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. దీంతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధులను కూడా కేటాయించాలని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

వరస భేటీలతో...
సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అవసరమైన రుణాలను తీసుకునేందుకు అనుమతి ఇప్పించాలని కూడా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు తర్వాత రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన సమస్యలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయనను చంద్రబాబు కోరనున్నారు.


Tags:    

Similar News