హైదరాబాద్ లో వివాహవేడుకకు హాజరైన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నారు.;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజర్ రెడ్డి వివాహానికి హాజరైన చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి బయలుదేరి వెళ్లారు.
జూబ్లీహిల్స్ లోని...
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ హలు లో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల కుమారుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల గిరి ప్రకాష్ రెడ్డి, సుమల దంపతుల కుమార్తె సుమేఘరెడ్డి ల వివాహ వేడుకకు ముఖ్యమంత్రిచంద్రబాబు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు హాజరయ్యారు.