Andhra Pradesh : ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు;

Update: 2025-03-21 01:33 GMT
chandrababu naidu, chief minister, aurance, farmers
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న బకాయీల చెల్లింపునుకు ఓకే చెప్పారు. ఉద్యోగులకు తక్షణమే 6,200 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎఐ కింద ఆర్థిక శాఖ 6,200 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు గత కొన్నేళ్లుగా చెల్లించాల్సిన బకాయీలను చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఆర్ధిక ఇబ్బందులున్నా...
ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలని ఆయన భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా ప్రయోజనాలు పొందకుండా కేవలం పింఛను పొందుతూ ఉన్నారు. అలాంటి వారికి చంద్రబాబు నిర్ణయంతో గ్రేట్ రిలీఫ్ వచ్చిందనే చెప్పాలి. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేందుకు ఉద్యోగుల బకాయీలను తక్షణమే చెల్లించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే పాలనలో తమకు సహకరించాలని కూడా ఉద్యోగులను కోరారు. చంద్రబాబు నిర్ణయంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News