ఎస్సీవాడలకు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎస్సీ వాడల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎస్సీ వాడల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 40 శాతానికి పైగా ఎస్సీలున్న 1027 గ్రామాలను ఎంపిక చేసి అందులో మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడంతో ఎస్సీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది.
మౌలిక వసతుల కోసం...
దళిత వాడల్లో మౌలిక వసతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 కోట్లు విడుదల చేసింది. తొలి విడతగా 101 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన చేయాలని నిర్ణయించింది. విడతల వారీగా నిధులు మంజూరు చేస్తూ ఎస్సీ వాడలలో రహదారులు, మంచినీరు, విద్యుత్తు సౌకర్యం వంటి వాటికి ప్రాధాన్యత మిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.