నేడు కాకినాడకు మంత్రి నారాయణ
ఈరోజు కాకినాడ జిల్లాలో ఇన్ ఛార్జి మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు;

ఈరోజు కాకినాడ జిల్లాలో ఇన్ ఛార్జి మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు చేసిన సూచనలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడంపై చర్చ జరపనున్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు,ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు మంత్రి నారాయణ దిశా నిర్దేశం చేయనున్నారు.
పలు సంక్షేమ పథకాలతోపాటు...
జిల్లాల్లో అభివృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు చేసిన సూచనను అధికారులకు తెలియజేయనున్నారు. అలాగే వివిధ పథకాల అమలుపై కూడా నారాయణ సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యే లు,అధికారులు పాల్గొనున్నారు.