రేపు హర్యానాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు హర్యానాకు వెళ్లనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు హర్యానాకు వెళ్లనున్నారు. రేపు జరగనున్న హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం ఛండీగఢ్ లో ఎన్డీఏ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 12.30 నుంచి 2 వరకు చండీఘడ్ లో ఎన్డీఏ సమావేశం జరుగుతుంది.
ఛత్తీస్‌గఢ్‌లో...
రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు చండీ ఘడ్ లో జరగనున్న ఎన్డీఏ పక్షాల సమావేశం లో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం చంద్రబాబు తిరిగి రాత్రి కి విజయవాడ చేరుకోనున్నారు. ఎన్డీఏ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశముంది. కాాగా ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్తపారిశ్రామిక విధానానికి ఆమోదం తెలిపింది. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించాారు.