Chandrababu : నేడు గుడ్లవల్లేరుకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు గుడ్లవల్లేరుకు చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు డోకిపర్రు వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు విడదల చేశఆరు.
అరవింద్ కు చంద్రబాబు ఫోన్
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మరోవైపు అల్లు అరవింద్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై అల్లు అరవింద్ తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. అరెస్ట్ ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్ కు చంద్రబాబు సూచించారు.