చంద్రబాబుకు యోగి ఆదిత్యానాధ్ ప్రత్యేక ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు

Update: 2024-12-08 02:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమ ప్రాంతంలో జరిగే కుంభమేళాకు హాజరు కావాలని చంద్రబాబును యోగి ఆదిత్యానాధ్ కోరారు. వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రయాగరాజ్ లో కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాకు రావాలని ప్రత్యేక ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం యోగి ఆదిత్యానాధ్ పంపారు.

జనవరిలో వెళ్లే అవకాశం...
ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మౌర్య వచ్చి స్వయంగా చంద్రబాబుకు ఆహ్వాన లేఖను అందచేశారు. కుంభమేళాకు రావాలని ప్రత్యేక ఆహ్వానం పంపారు. దీంతో వచ్చే నెలలో చంద్రబాబు ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ ఆహ్వానాన్ని చంద్రబాబు కూడా స్వాగతించినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News