Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. చంద్రబాబు ఈరోజు ఉదయం 11.15 గటలకు సచివాలయానికి వస్తారు. వివిధ శాఖలపై సమీక్షలను నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముందుగా విద్యుత్తు శాఖపై చంద్రబాబు నేడు సమీక్ష చేయనున్నారు.
రెవెన్యూ శాఖపై...
అనంతరం మైనింగ్ శాఖపై సమీక్షను నిర్వహిస్తారు. వివిధ అధికారులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంపై కూడా ఆయన అధికారులతో చర్చించనున్నారు. రెవెన్యూ అధికారుల సమీక్షలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పొప్పుల గురించి ప్రస్తావించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.