రేపు నరసన్నపేటకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. రేపు జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరస జిల్లాల పర్యటన చేస్తున్నారు. రేపు జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగన్ అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రెండో విడత కార్యక్రమాన్ని జగన్ నరసన్నపేట నుంచి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ 11 గంటలకు నరసన్న పేటకు చేరుకుంటారు.
శాశ్వత భూ హక్కు...
నరసన్న పేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు లబ్దిదారులకు పత్రాలను జగన్ అందించనున్నారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం జగన్ తిరిగి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో అధికారులు వెల్లడించారు. కాగా ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.