జగన్ "దర్బార్" ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ప్రజాదర్బార్ ను ప్రారంభించనున్నారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ప్రజాదర్బార్ ను ప్రారంభించనున్నారని తెలిసింది. సమస్యలపై నేరుగా ప్రజల నుంచి జగన్ వినతులు స్వీకరిస్తారు. ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఉదయం పూట తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో వినతులను జగన్ స్వీకరించనున్నారు. ముహూర్తం ఎప్పుడన్నది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
మొదటి వారంలో..
వచ్చే నెల మొదటి వారంలో ప్రజాదర్బార్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారంలో ఐదు రోజుల పాటు ఈ ప్రజాదర్బార్ నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఇక మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలిసి వారి నియోజకవర్గాల్లో సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటారు.