తొలి ఓటు వేయనున్న జగన్

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేయనున్నారు.

Update: 2022-07-18 03:39 GMT

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేయనున్నారు. తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈరోజు పది గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయత్రం ఐదు గంటల వరకూ జరుగుతుంది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీలు తమ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశాయి.

మాక్ పోలింగ్...
అంతకంటే ముందుగా వైసీపీ శాసనసభ పక్ష పార్టీ కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. గత ఎన్నికలలో ఓట్లు ఇన్ వాలిడ్ కావడంతో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు.  ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించనున్నారు. ఒక్క ఓటు కూడా వృధా కాకూడదన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో మాక్ పోలింగ్ లో వారికి అవగాహన కల్పించనున్నారు. మరోవైపు ఈరోజు 12 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రానున్నారు.


Tags:    

Similar News