రేపటి జగన్ అనంత పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. అనివార్య కారణాల వల్ల సీఎం పర్యటన రద్దయినట్లు చెబుతున్నారు. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రేపు జరగనున్న కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది.
ఎందుకంటే...
ఈ కార్యక్రమంో జగనన్న వసతి దీవెన కార్యక్రమం నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల జగన్ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. సీఎం పర్యటన రద్దు అయినట్లు అధికారికంగా శింగనమల ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది.