ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్

ఇంద్రకీలాద్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు

Update: 2023-10-20 12:36 GMT

ఇంద్రకీలాద్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మూలా నక్షత్రం కావడంతో ఈరోజు ఇంద్రకీలాద్రిలో భక్తులు లక్షలాది మంది వచ్చారు. క్యూ లైన్లన్నీ తెల్లవారు జాము నుంచే భక్తులతో నిండిపోయి కనిపించాయి. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనకు ఆలయ చిన్న రాజగోపురం వద్ద పరివేష్టం చుట్టారు.

పట్టు వస్త్రాలు...
అనంతరం వెండి పళ్లెంలో అమ్మవారికి ప్రభుత్వం తరుపున జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు ఈరోజు భక్తులకు దర్శనిమిచ్చింది. మూలా నక్షత్రం రోజున నాలుగు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సెకనుకు ముగ్గురు నుంచి నలుగురు భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News