Ys Jagan : బెజవాడలో పర్యటించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ ఫ్రంట్ పార్క్‌లను జగన్ ప్రారంభించారు. అనంతరం విజయవాడ నగరంలోని సెంట్రల్, తూర్పు నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కృష్ణా రివర్ ఫ్రంట్ కు పార్క్‌కు జలవిహార్ గా జగన్ పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కృష్ణానది వరదల్లో చిక్కుకుంటున్న కృష్ణలంక వాసులను పట్టించుకోలేదన్నారు.
అనేక కార్యక్రమాలను...
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 300 కోట్ల రూపాయలు పైచిలుకు వ్యయంచేసి రిటైనింగ్ వాల్ నిర్మించామని తెలిపారు. కృష్ణానదికి ఇప్పుడు పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నది ఒడ్డున ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. రిటైనింగ్ వాల్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించేలా పార్క్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా పట్టాల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ తన చేతుల మీదుగా అందచేశారు.