Ys Jagan : నేడు వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల

వైఎస్సార్ లా నేస్తం నిధులు కింద నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విడుదల చేయనున్నారు

Update: 2023-12-11 03:50 GMT

Andhra pradesh

వైఎస్సార్ లా నేస్తం నిధులు కింద నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ నిధులను యువ లాయర్ల ఖాతాల్లో జమ చేయనున్నారు. జూనియర్ న్యాయవాదులకు అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో వైఎస్సార్ లా నేస్తం ను ఏర్పాటు చేవఆరు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులను నేడు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

2,807 మంది లబ్దిదారులకు...
ఈ వైఎస్సార్ లా నేస్తం కింద ఈరోజు 2,807 మంది లబ్దిదారుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. జూనియర్ న్యాయవాదులు లా బుక్స్ ను కొనుగోలు చేసుకోవడానికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున స్టయిఫండ్ ను ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి ముప్పయివేల వంతున నిధులను విడుదల చేయనున్నారు. యువ న్యాయవాదులను ఆదుకుంటే న్యాయవాద వృత్తిలో మరింత మంది ఆకర్షితులవుతారని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.


Tags:    

Similar News