Ys Jagan : ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్.. నేడు వారి ఖాతాల్లో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వడ్డీని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వడ్డీని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 4.07 లక్షల మంది ఈ పథకం కింద లబ్డి పొందనున్నారు. వడ్డీని ఫీజు రీఎంబర్స్‌మెంట్ సీఎం వైఎస్ జగన్ నేడు చేయనున్నారు. పేదలకు ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలను మంజూరుచేసిన ప్రభుత్వం అందులో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అయితే కొందరు బ్యాంకు నుంచి ఇళ్ల నిర్మాణం కోసం రుణాలను పొందారు. వీరిని గుర్తించిన ప్రభుత్వం తొలి విడత వారికి ఈ రుణాలపై వడ్డీని చెల్లించాలని నిర్ణయించింది.
వడ్డీ రాయితీని...
ఈ వడ్డీ రీఎబంబర్స్ మెంటు కు 4.07 లక్ష మంది లబ్దిదారులకు వైఎస్ జగన్ వడ్డీ రాయితీ అందివ్వనున్నారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం తొలి విడత 46 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొందరు లబ్దిదారులతో మాట్లాడనున్నారు.