Ys Jagan : నేడు తిరుపతికి జగన్.. షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతికి వెళ్లనున్నారు. ఒక ప్రయివేటు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతికి వెళ్లనున్నారు. ఒక ప్రయివేటు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద కొద్దిసేపు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి తిరుపతిలోని తాజ్ హోటల్ కు చేరుకుంటారు.
వివాహ రిసెప్షన్ లో...
తిరుపతి తాజ్ హోటల్ లో జరిగే శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ లో జగన్ పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం 5.45 గంటలకు తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈపర్యటనలో పార్టీ నేతలతో కొద్దిసేపు సమావేశమయ్యే అవకాశముందని తెలిసింది.