Ys jagan : నెల్లూరు జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా కడప జిల్లాకు బయలుదేరి వెళతారు. కడప నుంచి హెలికాప్టర్ లో ఉదయగిరి చేరుకుంటారు. అక్కడ దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలలో పాల్గొననున్నారు.
అంత్యక్రియలలో పాల్గొని....
ఉదయగిరిలో 11 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. మెరిట్ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న మేకపాటి అంత్యక్రియల్లో జగన్ పాల్గొంటారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.