నేడు టెక్కలి నేతలతో జగన్ సమావేశం

టెక్కలి నియోజకవర్గం నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.

Update: 2022-10-26 07:36 GMT

టెక్కలి నియోజకవర్గం నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాలపై జగన్ దృష్టి పెట్టినట్లే కనపడుతుంది. ఇప్పటి వరకూ కుప్పం, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో జగన్ సమీక్ష నిర్వహించారు. తాజాగా టెక్కలి నేతలతో నేడు సమావేశం కానున్నారు.

అచ్చెన్న ఇలాకాలో...
టెక్కలిలో గత ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీగా జగన్ ఎంపిక చేశారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ గెలవాల్సిన అవసరంపై జగన్ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపు నివ్వనున్నారు.


Tags:    

Similar News