నేడు "వైఎస్సార్ కల్యాణమస్తు" విడుదల

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేయనున్నారు.

Update: 2023-05-05 03:07 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేయనున్నారు. నేడు క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జనవరి నుంచి మార్చి లో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్దిదారులకు వైైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కింద 87.32 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు ద్వారా ఈ నిధులను బదిలీ చేయనున్నారు.

అర్హతలివే...
వధూవరులు ఇద్దరికీ 10 వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే మన లక్ష్యం కాదు, వందకు వంద శాతం గ్రాడ్యుయేట్‌లుగా మన పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాలకు పదవ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా, వరునికి 21 ఏళ్ళుగా ప్రభుత్వం నిర్దేశించింది. గడిచిన ఆరు నెలల్లోనే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల కింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 125.50 కోట్లు జమ ప్రభుత్వం జమ చేసింది.


Tags:    

Similar News