నేడు తల్లుల ఖాతాల్లో జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యార్థులకు తీపి కబురు చెప్పనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యార్థులకు తీపి కబురు చెప్పనున్నారు. జగనన్న విద్యాదీవెన కింద ఈరోజు 686 కోట్లు చెల్లించనున్నారు. ఈ ఏడాది మూడో విడత కింద 11.03 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఈ పథకం కింద లబ్దిపొందనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ పథకం కింద నగదును తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మూడో విడత....
కరోనా సమయంలోనూ జగన్ సంక్షేమ పథకాలను ఆపలేదు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని జగనన్న విద్యాదీవెన గా మార్చారు. ఇప్పటి వరకూ ఈ రెండున్నరేళ్లలో ఈ పథకం 6,259 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించింది. ప్రతి మూడు నెలలకొకసారి ఈ పథకం కింద విద్యార్థి చెల్లించాల్సిన ఫీజును చెల్లిస్తారు.