రేపు ఆళ్లగడ్డకు జన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.;

Update: 2022-10-16 06:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం రెండో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ బయలుదేరతారు. 10.15 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటారు. వర్చువల్ గా నిధులను విడుదల చేయనున్నారు.

రైతు భరోసా...
వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనున్న బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. బటన్ నొక్కి లబ్దిదారులకు నిధులను విడుదల చేస్తారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడీతరు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరి చివరకు తాడేపల్లికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


Tags:    

Similar News