Pawan Kalyan : నేడు కర్నూలు జిల్లాకు పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.;

Update: 2025-01-11 02:05 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకునే ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్ లో పిన్నపురం వద్ద నిర్మాణమవుతున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టున ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

పరిశీలన అనంతరం...
ఈ ప్రాజెక్టు నిర్మాణం పదిహేను వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. 5,230 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్ష చేస్తారు. అనంతరం తిరిగి విజయవాడ బయలుదేరి తన కార్యాలయానికి చేకుంటారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. అలాగే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News