27న నెల్లూరుకు సీఎం జగన్
ఈ నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.;
ఈ నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరుకు ఆయన చేరుకోనున్నారు. నేలటూరులో ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 800 మెగావాట్లు అని అధికారులు చెబుతున్నారు.
జాతికి అంకితం...
ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.55 గంటలకు కృష్ణపట్నం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేలటూరుకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అక్కడ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి 3.30 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.