ఈ నెల 6న నెల్లూరుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 6వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 6వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 6న నెల్లూరు జిల్లాలోని పెన్నా, సంగం బ్యారేజీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.
సంగం, పెన్నా...
సంగం, పెన్నా బ్యారేజీల ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు వైసీపీ నేతలతో సమావేశమయ్యే అవకాశముంది. జగన్ పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించారు.