నేడు నెల్లూరులో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన సంగం బ్యారేజీని ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరతారు. 10.40 గంటలకు సగం చేరుకుంటారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.
ఏర్పాట్లు పూర్తి....
అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జి వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు వైసీపీ నేతలు కూడా జగన్ రాకకోసం ఆయన వచ్చే దారి మొత్తం స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.