రేపు నెల్లూరు జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నా నదిపై సంగం వద్ద నిర్మించిన బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారు. రేపు ఉదయం 9.30 గంటలకు గన్న వరం ఎయిర్‌పోర్టు నుంచి 10.40 గంటలకు సంగం చేరుకుంటారు.
నెల్లూరు బ్యారేజీని....
అక్కడ సంగం బ్యారేజీని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెలలూరు బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. తిరిగి 2.20 గంటలకు బయలుదేరది సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది