Ys Jagan : నేడు రాప్తాడు సిద్ధం సభకు జగన్.. రైతు రుణమాఫీ ప్రకటించే అవకాశం
నేడు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన చేయనున్నారు. ఆయన సిద్ధం సభలో పాల్గొననున్నారు;
నేడు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన చేయనున్నారు. ఆయన సిద్ధం సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి భీమిలీలోనూ, కోస్తా జిల్లాల్లో దెందులూరులోనూ సిద్ధం సభలను నిర్వహించారు. నేడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాప్పాడులో సిద్ధం సభను నిర్వహించనున్నారు. ఈ సభలో వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది. ముఖ్యంగా వ్యవసాయ రుణ మాఫీపై ప్రకటన ఉంటుందని తెలిసి వచ్చింది. రైతులకు రెండు లక్షల రూపాయలకు పైగా రుణ మాఫీ చేస్తానని రాప్తాడు సిద్ధం సభ నుంచి జగన్ హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
యాభై రెండు నియోజకవర్గాలకు...
రాప్పాడు సభకు అంతా సిద్ధమయింది. మూడో సభ రాయలసీమలో విజయవంతం చేయడానికి పార్టీ నేతలు గత కొద్దిరోజులుగా శ్రమిస్తున్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల నుంచి ఈ సభకు పార్టీ శ్రేణులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించడంతో కార్యకర్తలను సమీకరించే బాధ్యతను వారిపై పార్టీ ఉంచింది. సభకు లక్షల్లో జనం హాజరు కానున్న నేపథ్యంలో సీమ నుంచే రైతుల కోసం ఈ హామీని జగన్ ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇందుకోసం రాప్తాడు లో 250 ఎకరాల్లో ప్రాంగణానని సిద్ధం చేశారు. గత కొద్ది రోజుల నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు.